గంపలగూడెం: అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

76చూసినవారు
గంపలగూడెం: అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం
గంపలగూడెం మండలం నెమలి గ్రామ శివారులో తెలంగాణ నుండి ఆంధ్రకు ఐసర్ లారీలో తరలిస్తున్న 7 టన్నుల రేషన్ బియ్యాన్ని, లారీని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున ఎలాంటి అనుమతులు లేకుండా రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో తనిఖీ నిర్వహించామన్నారు. ఐసర్ లారీనీ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్