అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే అని మైలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్. తిరుపతి రావు అన్నారు. మైలవరం పట్టణంలో గురువారం జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాల్లో ఆయన హాజరయ్యారు. ఉద్యమాలు చేపట్టడంలో ఆధ్యుడని కొని ఆడారు. మహనీయులు బాటలో మనం అందరం నడుద్దామని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారత లాంటి ప్రధాన సమస్యలపై ఉద్యమాలు చేశారన్నారు.