తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలంలోని పెనుగొలను సరిహద్దులో ఉన్న మెట్టగుట్ట శ్రీ శేషాచల శ్రీనివాస స్వామి ఆలయంలో బుధవారం కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న దేవతలను దర్శించి ఫోటోలు తీసుకున్నారు. మెట్టగుట్ట ఆలయంలో తాగునీటి బ్యాంకు నిర్మాణానికి గన్నవరం అర్చకుడు టి. రవి తేజ 10,000 రూపాయలు దానం చేసినట్లు ఆలయ చైర్మన్ పంది వెంకట్రావు తెలిపారు.