ఊటుకూరు: స్వామి సన్నిధిలో కుడారై ఉత్సవం

58చూసినవారు
ఊటుకూరు: స్వామి సన్నిధిలో కుడారై ఉత్సవం
తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఊటుకూరు శ్రీ కోదండరామస్వామి సన్నిధిలో ధనుర్మాసం ఉత్సవాల్లో భాగంగా 27వ రోజు కూడారై ఉత్సవం శనివారం ఘనంగా జరిగింది. అర్చకులు మరింగంటి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిపారు. ఉత్సవం ఎంతో విశిష్టమైనదన్నారు. ఆండాళ్‌ అమ్మవారిని కీర్తిస్తూ గోదాదేవి పాశురాలను వివరించారు. మహిళలు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. 108 గంగాళాల్లో ప్రత్యేకంగా తయారు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్