భారతీయ జనతా పార్టీ విస్సన్నపేట మండల అధ్యక్షులుగా గంగిశెట్టి మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎలక్షన్ పరిశీలకు బోగవల్లి శ్రీధర్, మాదాల రమేష్ మధు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు శుక్రవారం ప్రకటించారు. గండిశెట్టి మధు ను మండల అధ్యక్షులుగా మేడ కమలాకర్ పిల్లి యలమందరావు ప్రపోజ్ చేయగా మండల బూత్ కమిటీ అధ్యక్షులు ఏకగ్రీవంగా ఆయనకు మద్దతు ఇచ్చారు. అనంతరం బిజెపి నాయకులు గంగిశెట్టి మధును దుశ్శాలువతో సత్కరించారు.