తిరువూరు నియోజకవర్గ పరిధిలో తిరువూరు మండలం ఆంజనేయపురం గ్రామ పంచాయతీలో దోమల నివారణ కు ఆదివారం ఫాగింగ్ చేశారు. గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. గ్రామ సర్పంచ్ మామిడి కుటుంబరావు, చౌటుపల్లి హెల్త్ సూపర్వైజర్ మధుసూదన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరేంద్ర , ఏఎన్ఎం రామకృష్ణమ్మ, డిజిటల్ అసిస్టెంట్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.