అన్ని ప్రభుత్వ పాఠశాలలో జరిగినట్లే జూనియర్ కళాశాలలో కూడా మధ్యాహ్నం భోజనం జరుగుతుందని తిరువూరు జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహారావు అన్నారు. శనివారం తిరువూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన లాంచనంగా ప్రారంభించారు. ఈ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు. తిరువూరు ఎంఈఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.