ప్రముఖ పత్రిక గ్రూప్ సంస్థల చైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మ విభూషణ్ గ్రహీత చెరుకూరి రామోజీరావు మృతి చెందడంతో సంతాపం తెలుపుతూ, చిత్రపటానికి తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు శనివారం ఘన నివాళులర్పించారు. తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన లేని లోటు యావత్ ప్రపంచానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.