తిరువూరు నియోజకవర్గం లోని ఏ కొండూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మధ్యాహ్నం భోజనం పథకం క్రింద సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. బుధవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆదేశాలతో కార్పొరేట్ పాఠశాల లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయని అన్నారు.