తిరువూరు పట్టణంలోని షాదిఖానాలో 500 మంది ముస్లిం మహిళలకు నూతన వస్త్రాలను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సతీమణి కొలికపూడి మాధవి శుక్రవారం పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ముస్లిం మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ముస్లింలకు శుక్రవారం శుభసూచకమని నూతన వస్త్రాలను అందిస్తున్నట్లు వెల్లడించారు. ముస్లిం సోదర సోదరీమణుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.