గంపలగూడెం మండలం పెనుగొలనులో ఆదివారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానంద జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆయన చిత్రపటానికి పూలతో పూజించారు. యోగానంద తాను స్థాపించిన సేల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థల ద్వారా లక్షలమంది జనాలకు ధ్యానం, క్రియా యోగ పద్ధతులు నేర్పించారని విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి తెలిపారు.