గంపలగూడెం మండలం పెద్ద కొమిర కేజిబివి మోడల్ స్కూల్ లో శుక్రవారం సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు ఉపాధ్యాయులు విద్యా రంగానికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలను కొనియాడారు. డెమొక్రాటిక్ పీ ఆర్ టీ యూ మండల శాఖ ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.