గంపలగూడెం మండలం పెనుగొలనులో ఏప్రిల్ 17వ తేదీ గురువారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో 99వ కోడ్ అంగన్వాడి కేంద్రంలో తులాభారం కార్యక్రమం నిర్వహించనున్నారు. హాజరు శాతం ఎక్కువ ఉన్న ఇద్దరు చిన్నారులకు తులాభారం ఏర్పాటు చేయనున్నారు. ఎంపికైన చిన్నారులను తులాభారం వేసి బియ్యము, కందిపప్పు, పండ్లు, కూరగాయలు, నోట్ పుస్తకాలు అందజేస్తారని సాయిబాబా కమిటీ సభ్యులు వివరించారు.