గంపలగూడెం పెనుగొలను సరిహద్దులో ఉన్న మెట్టగుట్ట శ్రీశేషాచల శ్రీనివాసస్వామి ఆలయంలో రథ సప్తమి వేడుకలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు తూమాటి శ్యాంసుందరాచార్యులు, యోగానందచార్యులు శ్రీనివాసుని ఉత్సవ విగ్రహాలను సూర్యప్రభ వాహనంపై ఆశీనులను చేసి పూలదండలతో విశేషంగా అలంకరించారు. అర్చకులు సూర్యోప్రాసనలు చదివి వాటి విశిష్టతను విశదీకరించారు. సూర్య భగవానుడిని ప్రార్ధించటం వలన కలిగే ఆరోగ్య విషయాలు వివరించారు.