పెనుగొలను: డ్రైనేజీ దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు

75చూసినవారు
పెనుగొలను: డ్రైనేజీ దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు
గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని దేవర నరసయ్య బజార్ రోడ్డులో డ్రైనేజీ సక్రమంగా లేకపోవడంతో నీరు నిల్వ ఉంది. దీంతో దుర్వాసన రావడంతో పాటు దోమలు చేరి వ్యాధులు వ్యాపించే అవకాశముంది. వరుసగా ఇళ్లు ఉండటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పరిస్థితిని గమనించి నీరు నిల్వ కాకుండా చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్