తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు శనివారం తిరువూరు మండల పరిషత్ సర్వసభ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తిరువూరు ఎంపీపీ గద్దల భారతి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. జడ్పిటిసి సభ్యులు రామచంద్ర రెడ్డి, శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.