గంపలగూడెం 60వ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం అంగన్వాడి సూపర్వైజర్ ముని లక్ష్మీ ఆధ్వర్యంలో పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. గర్భిణిగా, బాలింతగా ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించారు. శిశువులలో ఇన్ఫెక్షన్లు నివారించడానికి చేతులు కడుక్కోవడం, పరిశుభ్రత గురించి తల్లులకు వివరించారు. గర్భిణీలు, బాలింతలు, వివిధ అంగనవాడి కేంద్రాలు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు.