తిరువూరు నియోజకవర్గ పరిధిలోని తిరువూరు రాజుపేట లో వేంచేసియున్న శ్రీ అష్టలక్ష్మీ ఆలయంలో ఈనెల 5న అమ్మవారికి సారె సమర్పించే కార్యక్రమం జరుగుతుందని ఆలయ ధర్మకర్త కాసులనాటి పద్మనాభ శాస్త్రి బుధవారం తెలిపారు. శ్రీరస్తు కల్యాణ మంటపం నుండి మహిళా భక్తులు ఊరేగింపు గా వచ్చి సారె సమర్పిస్తారని, భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు.