గంపలగూడెం మండలం పెనుగొలనులో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ సౌత్ ఏషియన్ గేమ్స్ లో 3 బంగారు పతకాలు సాధించిన రాళ్ళచర్ల రమణయ్యను శిరిడి సాయి సేవా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. ముందుగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రమణయ్య బంగారు పతకాలు సాధించి గ్రామానికి , దేశానికి మంచి పేరు తీసుకొచ్చారని కొనియాడారు. చివరిగా సన్మాన గ్రహీత రమణయ్య తాను ఈ స్థితికి రావడానికి కారణమైన పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.