గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామపంచాయతీ ఆఫీస్ వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద మే నెల 21 నుంచి మూడు రోజులు పాటు స్వామివారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 21వ తేదీ బుధవారం ఆలయ శుద్ధి కార్యక్రమం, ఆంజనేయ స్వామికి పల్లకి సేవ, 22న గురువారం స్వామి వారికి పంచామృతాలతో అభిషేకము, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం, 23న శుక్రవారం దీపోత్సవం, భజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.