పెనుగొలనులో బుధవారం తెలుగు నాటక రంగ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా రచయిత కందుకూరి వీరేశలింగం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ నాటక కళాకారుడు తల్లపురెడ్డి కిషోర్ రెడ్డి ని సాయిబాబా సేవా కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏవి . నరసింహారావు, విశ్రాంత ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి, గ్రంథాలయ అధికారిణిజె. శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.