గంపలగూడెం మండలంలోని పెనుగొలను బోటి మీద ఉన్న శ్రీనరసింహ స్వామి ఆలయంలో శుక్రవారం మేళతాళాలతో వైభవంగా నరసింహ స్వామివారి కల్యాణం నిర్వహించారు. వేద పండితులు సత్యనారాయణ శర్మ, ఆలయ అర్చకులు వెంకటేశ్వర స్వామి ముందుగా గణపతి, నవగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి కళ్యాణ తంతు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు సహకారంతో అన్నదానం చేశారు.