తిరువూరు: శాకాంబరి అలంకరణలో అమ్మవారం

7చూసినవారు
తిరువూరు: శాకాంబరి అలంకరణలో అమ్మవారం
గంపలగూడెం మండలం ఊటుకూరు కోదండరామస్వామి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా శనివారం రాజ్యలక్ష్మి, గోదాదేవి అమ్మవార్లకు శాకాంబరి అలంకరణ చేశారు. అమ్మ వార్లకు పండ్లు, కాయగూరలు, ఆకుకూరలతో దండలు వేసి చూడముచ్చటగా అలంకరించారు. ఆలయ అర్చకులు రామకృష్ణాచార్యులు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని అమ్మవార్లను దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పరివేక్షించారు.

సంబంధిత పోస్ట్