తిరువూరు మండలం గానుగుపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ ఉపాధ్యాయులు చింతలపాడు గ్రామంలో లౌడ్ స్పీకర్ ద్వారా శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలో చేరండి అని ప్రచారం చేశారు. గానుగ పాడు హైస్కూల్లో గత రెండు సంవత్సరాల నుంచి పదో తరగతిలో పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయని వారు వివరించారు. పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు వి. సాయిరాం, ఆంగ్ల ఉపాధ్యాయుడు యం. రాం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.