తిరువూరు మండలం గానుగుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మంగళవారం రూ. 50వేలు విలువ చేసే కంప్యూటర్ ను పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు మందడపు రాం ప్రదీప్ అందజేశారు. విద్యార్థులకు ఈ కంప్యూటర్ చాలా ఉపయోగపడుతుందని ప్రధానోపాధ్యాయులు వి. సాయిరాం తెలిపారు. ఉపాధ్యాయులు ఎస్ వి బి రాజేంద్ర ప్రసాద్, ఎస్. రామారావు, సుదర్శన్, ఎం. సాంబశివరావు, వెంకటేశ్వర్లు, బి. రాము, వై. ప్రసన్న, ఎం. హరీష్ పాల్గొన్నారు.