సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ పాటల పోటీలను ప్రోత్సహించాలని తిరువూరు ఎస్సై కేవీ జె వి సత్యనారాయణ అన్నారు శనివారం తిరువూరు మండలం కోకిలంపాడు రోడ్ లోని గ్రౌండ్లో మండల స్థాయి కబడ్డీ పోటీలను ఎస్ఐ చేతుల మీదుగా ప్రారంభించారు. యువత క్రీడా పోటీల పట్ల ఆసక్తి పెంచుకోవాలని తద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జూధ క్రీడల పట్ల మక్కువ తగ్గించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.