తిరువూరు మండలం ముష్టికుంటలో ధాన్యం బస్తాలు రోజుల తరబడి ట్రాక్టర్లలోనే నిలిచిపోవడంతో రైతులు బుధవారం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిగుమతి ఆలస్యం కావడంతో వెయిటింగ్ ఛార్జీల భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు కోరారు. నష్టాల నుంచి తమను ఆదుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేసామన్నారు.