డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో తిరువూరు పట్టణంలో బోస్ బోమ్మ సెంటర్ లో బుధవారం నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ డీఎస్సీ నోటిఫికేషన్ లో ఉన్న సమస్యలను పరిష్కరించి అభ్యర్థులందరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒక జిల్లాకు ఓకే పేపర్ ఉండాలని డిమాండ్ చేశారు. నర్మాలైజేషన్ వల్ల అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.