విస్సన్నపేట(మ), కలగర పంచాయతీకి చెందిన కుందపల చెరువుకి మహర్దశ తిరిగింది. రహదారి లేక కొన్ని దశాబ్దాలుగా ఎన్నో ఇబ్బందులు రైతులు ఎదుర్కొంటున్నారు. రహదారి విషయమై తిరువూరు టీడీపీ యువ నాయకులు (ఎన్నారై) వల్లభనేని గిరిబాబు దృష్టికి రైతులకు తీసుకువెళ్లగా ఆయన స్పందించారు. ఆదివారం తక్షణమే తన సొంత ఖర్చులు రూ.10 లక్షలతో రహదారి మార్గాన్ని ఏర్పాటు చేసినందుకు రైతులు హర్షం వ్యక్తం చేశారు.