తిరువూరు: శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

76చూసినవారు
తిరువూరు: శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి
విద్యార్థులలో దాగిఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి జన విజ్ఞాన వేదిక ప్రతి ఏటా ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమని తిరువూరు విద్యాశాఖాధికారి ఏ. శ్యాం సుందరరావు అన్నారు. ఆదివారం స్థానిక మండల విద్యా కేంద్రంలో జెవివి రూపొందించిన వేసవి శిక్షణ శిబిర కర పత్రాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. స్పోకెన్ ఇంగ్లీష్, జనరల్ సైన్స్, మ్యాథ్స్, మేజిక్ షోలలో శిక్షణ ఇస్తామనిన్నారు.

సంబంధిత పోస్ట్