విస్సన్నపేట మండలం టీడీపీ అధ్యక్ష పదవిని పొందేందుకు యువతకి అవకాశం ఇవ్వాలని శుక్రవారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ని కోరిన జిల్లా తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి తుమ్మలపల్లి అనిల్ కోరారు. టీడీపీలో మార్పు కోరుతూ యువతకు పెద్దపీట వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తుమ్మలపల్లి సునీల్, మండల ఉపాధ్యక్షులు చంటి, తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు.