తిరువూరు నియోజకవర్గ పరిధిలో గల గంపలగూడెం మండలలోని పెనుగొలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తిరువూరు ఆర్డీవో కె. మాధురి శనివారం తనిఖీలు చేశారు. పదో తరగతి విద్యార్థులను మధ్యాహ్న భోజనం ఎలా ఉందని పిల్లల్ని ఆర్డిఓ అడిగి తెలుసుకున్నారు. ఆర్డిఓ వెంట తహశీల్దార్ వి. రాజకుమారి, రెవిన్యూ సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.