తిరువూరు ఆర్డీవో మాధురి శుక్రవారం తిరువూరు మండలం మునుకుళ్ళు గ్రామంలోని దాన్యo కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు అమ్ముకుంటున్న ధాన్యం వివరాలను ఆమెకు అధికారులు వివరించారు. రైతులకు అందుబాటులో ఉండి వారికి ప్రభుత్వ సేవలు సకాలంలో అందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.