తిరువూరు ఎమ్మెల్యేకు ఆహ్వానం లేదు

53చూసినవారు
తిరువూరు మున్సిపాలిటీ సమావేశం శనివారం వాడివేడిగా సాగింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును ఈ సమావేశానికి ఆహ్వానించకపోవడంపై టీడీపీ కౌన్సిలర్లు అబ్దుల్ హుస్సేన్, సురేంద్ర లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ పనితీరుపై కౌన్సిలర్లు మండిపడ్డారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. దీనిపై కౌన్సిల్లో వాడివేడి చర్చ సాగింది.

సంబంధిత పోస్ట్