గంపలగూడెం మండలం పెనుగొలనులో ఆదివారం సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో అభ్యుదయ కవి శ్రీశ్రీ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. శ్రీశ్రీ సమాజంలో చైతన్యం తెచ్చేందుకు మహాప్రస్థానం, ఖడ్గసృష్టి వంటి గొప్ప రచనలు చేశారని గ్రంథాలయ అధికారిణి శ్రీలత వివరించారు