విస్సన్నపేట మండలం స్థానిక మండల కేంద్రంలో అక్రమంగా రవాణా చేస్తున్న రెండు టిప్పర్ల ఇసుకను ఎస్ఐ రామకృష్ణ స్వాధీనపరుచుకున్నారు. పోలీసులకు రాబడిన సమాచారం మేరకు ఇసుక టిప్పర్లను స్వాధీనపరచుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు. వీరిపై వాల్టా యాక్ట్ కేసు నమోదు చేసినట్లుగా ఆదివారం ఎస్ఐ రామకృష్ణ మీడియాకు తెలియజేశారు.