తిరువూరు నియోజకవర్గ పరిధిలో గల తిరువూరు మండలం తోకపల్లి నుండి అక్రమంగా తరలిస్తున్న రెండు మట్టి ట్రాక్టర్లను సోమవారం అధికారులు పట్టుకున్నారు. గ్రామస్తుల నుండి సమాచారం అందటంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ట్రాక్టర్ తో పాటు జెసిబిని కూడా సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.