ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనం నడపకపోతే వాహనాన్ని సీజ్ చేయటం జరుగుతుందని తిరువూరు ఎస్సై కేవీజివి సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం రాత్రి తిరువూరు పట్టణంలోని బోస్బం సెంటర్ లో వాహనాల తనిఖీ చేపట్టారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని వాహనదారులకు ఎస్సై సూచించారు. హెల్మెట్ ధరించి వాహనం నడపడం వల్ల కలుగు ప్రయోజనాలను ద్విచక్ర వాహనదారులకు వివరించారు.