గంపలగూడెం మండలం పెనుగొలనులో గురువారం రాష్ట్రంలో కూటమి విజయం సాధించినందుకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆఫీస్ నుంచి పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు ప్రధాన వీధులు గుండా మెట్ట గుట్ట శ్రీ శేషచల శ్రీనివాస స్వామి దేవస్థానం వరకు పార్టీల జెండాలు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.