విస్సన్నపేట మండలం కొండపర్వలో బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి సభ ఆదివారం ఘనంగా జరిగింది. ఆయన చేసిన సేవలను కొనియాడుతూ పలువురు స్థానికులు మాట్లాడారు. ముఖ్యంగా యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్, జ్యోతిబాపూలే వంటి మహానుభావుల ఆశయాలను కొనసాగించాలని అన్నారు. కుల, మత భేదాలు లేకుండా సమాజ అభివృద్ధికి పాటుపడాలని ఉద్బోధించారు.