యూటీఎఫ్ వారు రూపొందించిన స్టడీ మెటీరియల్ ను దాతలు వైభవ్ జువెలర్స్ అధినేత కుక్కడపు వెంకట నాగేశ్వరరావుచే గురువారం విస్సన్నపేట స్కూల్ విద్యార్థులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విస్సన్నపేట ఎంఈఓ 2 సుధాకర్ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని సూచనలు సలహాలు ఇచ్చారు. జిల్లా కార్యదర్శి సి హెచ్ సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు పుస్తకాలు అందించిన నాగేశ్వరావు ధన్యవాదాలు తెలిపారు.