విస్సన్నపేట: రోడ్లపై ఆవుల సంచారం అదుపు చేయాలని వినతి

66చూసినవారు
విస్సన్నపేట: రోడ్లపై ఆవుల సంచారం అదుపు చేయాలని వినతి
రహదారులపై ఆవుల సంచారాన్ని అదుపు చేయాలని తిరువూరు నియోజకవర్గ తెలుగు రైతు ఉపాధ్యక్షుడు ధమ్మలపాటి సాంబశివరావు కోరారు. విస్సన్నపేట రోడ్లపై జరిగిన పలు ప్రమాదాల్లో ఆవులు చనిపోయినట్లు చెప్పారు. అలాగే వాహనదారులు అనేక ప్రమాదాలకు గురయ్యారని అన్నారు. శుక్రవారం సమస్యను పరిష్కరించాలని విస్సన్నపేట ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. తాతకుంట్ల ఆదర్శ రైతు పొన్నగంటి కేశవ, రాము పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్