తిరువూరు పట్టణంలోని ఫ్యాక్టరీ సెంటర్ లో అమరావతి రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి మహిళలు మంగళవారం నిరసన తెలియజేశారు. ఆడబిడ్డలను అవమానిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అనంతరం సాక్షి దినపత్రికలను కూటమి మహిళలు నడి రోడ్డుపై దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి శ్రేణులు, మహిళలు పాల్గొన్నారు.