ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ పిఏసి సభ్యులు పుప్పాల వాసు బాబును ఉంగుటూరు మండల ఎంపీటీసీ ఛాంబర్ అధ్యక్షులు బండారు నాగరాజు గురువారం భువనపల్లి క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. ఉంగుటూరు నియోజకవర్గం వైసీపీ చేనేత విభాగం అధ్యక్షులుగా నియమించినందుకు వాసు బాబుకు నాగరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నిడమర్రు మండలం చేనేత నాయకులు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.