విజయవాడ: యువకుడిపై గాజుసీసాతో దాడి

79చూసినవారు
విజయవాడలో యువకుడిపై గాజుసీసాతో దాడి చేసిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గొల్లపూడిలో ఇద్దరు స్నేహితుల మధ్య శుక్రవారం ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో గోవింద్ అనే యువకుడు సాయిపై గాజు సీసాతో దాడికి పాల్పడ్డాడు. సాయికి తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రక్తసిక్తంగా ఉన్న యువకులను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్