రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.250కోట్లను విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక వాణిజ్య మంత్రి పయ్యావుల కేశవ్ మొదటి సంతకం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయం రెండవ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమాల అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.250కోట్లను విడుదల చేస్తూ దస్త్రంపై తొలి సంతకం చేశారు.