విజయవాడలో మూగ జీవిని చిత్రహింసలు (విడియో)

69చూసినవారు
విజయవాడలో గురువారం మూగ జీవిపై అమానుష ఘటన చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు కిలోమీటర్ల మేర, నున్న ప్రాంతంలో శునకానికి తాడుకట్టి ఈడ్చుకుంటూ వెళ్లిన పరిస్థితి నెలకొంది. ఈ దారుణ ఘటనపై స్థానికులు ప్రశ్నించగా. పిచ్చికుక్క అని వారు జవాబు ఇచ్చారు. పాదచారులు గట్టిగా కేకలు వేయగా. శునకాన్ని రోడ్డు పక్కన విసిరేసి పరారయ్యారు. అనంతరం శునకం మృతిచెందింది.

సంబంధిత పోస్ట్