వీధి కుక్కకు పాలు తాగించిన వాలంటీర్

59చూసినవారు
విజయవాడలో బుడమేరు దెబ్బకు మనుషులే కాదు.. జంతువులు సైతం అలమటించిపోయాయి. నిలువ నీడ లేక కడుపుకింత కూడు లేక విలవిలలాడిపోయాయి. అయితే మనుషులకు ప్రభుత్వం ఆహారం, నీళ్లు, పాలు పంపిణీ చేసింది. కానీ మూగజీవాలకు మాత్రం ఎలాంటి సాయం అందలేదు. ఆకలితో అలమటించిన వీధికుక్కకు ఓ వాలంటీర్ పాలు తాగించారు. కుక్క ఆకలి తీర్చిన వాలంటీర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్