రేపు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఎండలు మండిపోతాయని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. ముఖ్యంగా విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు-పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 42.5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.