ఇంద్రకీలాద్రిపై ప్రతిష్టాత్మకంగా జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుండి అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. యాత్రికుల భద్రత దృష్ట్యా, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చూడాలని పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు అధికారులకు సూచించారు. దసరా బందోబస్తు సందర్భంగా బుధవారం మాచవరం పోలీస్ స్టేషన్ పరిదిలోని లయోలా నందు బందోబస్త్ విధులపై మార్గదర్శకాలు చేశారు.